ETV Bharat / city

ఈ ఏడాది కొత్తగా ఖైరతాబాద్ వినాయకుడు.. కేవలం మట్టితోనే..! - హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు 2022

Khairatabad Ganesh : భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఏటికేడు ఎత్తు పెరుగుతూ ప్రతి ఏడాది సరికొత్తగా భక్తులకు కనువిందు చేస్తాడు ఇక్కడి విఘ్నేశ్వరుడు. నగరంలోని ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్‌ గణపతిని చూడటానికి భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల సందర్భంగా గతానికి భిన్నంగా ఖైరతాబాద్ వినాయకుడిని రూపొందించేందుకు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ప్రతి సంవత్సరంలాగా ఆర్భాటంగా.. కాకుండా ఈ ఉత్సవాలకు మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Khairatabad Ganesh
ఈ ఏడాది కొత్తగా ఖైరతాబాద్ వినాయకుడు
author img

By

Published : Jun 10, 2022, 12:27 PM IST

Khairatabad Ganesh :తెలంగాణ ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కన్వీనర్‌ సందీప్‌, ఉపాధ్యక్షుడు మహేష్‌యాదవ్‌ తదితరులు మాట్లాడారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. విగ్రహం 50 అడుగుల ఎత్తు ఉండనుందని తెలిపారు. ఈనెల 24న హైకోర్టులో వినాయక విగ్రహాల తయారీపై వాదనలు ఉన్నాయని, ఆ రోజు వచ్చే తీర్పును బట్టి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో విగ్రహ ఏర్పాటుపై గురువారం సెంట్రల్‌ జోన్‌ డీసీపీ సమావేశం జరిగింది. అనంతరం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు కమిటీ ప్రకటించి, ఆ సమావేశంలో మట్టి విగ్రహం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పడంతో పోలీసుల ఒత్తిడి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఉత్సవ కమిటీ మాత్రం.. తమపై ఎవరి ఒత్తిడి లేదని, పోలీసులు పిలిచి కర్రపూజ, ఉత్సవాల నిర్వహణపై మాట్లారని తెలిపింది.

మరోవైపు.. హిందూ పండుగలను దెబ్బతీయాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భగవంతురావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం, పోలీసులు వినాయక విగ్రహాలు తయారు చేయొద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వినాయక చవితికి సంబంధించి ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించడంలేదని విమర్శించారు.

హిందూ సంప్రదాయ, ఆచార వ్యవహారాలను గౌరవించేందుకు ప్రభుత్వం సహకరించడంలేదని భగవంతురావు ఆక్షేపించారు. గణేష్ నిమజ్జనం వినాయక సాగర్‌లోనే జరుగుతుందని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. వినాయక సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం ప్రతికూలంగా వ్యవహారిస్తే సహించమని హెచ్చరించారు. పర్యావరణం, ప్రకృతికి విరుద్దంగా పండుగలేవీ లేవన్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.