కనకదుర్గ పైవంతెనపై వాహన రాకపోకలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. వాహన రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్న ఆయన..., అనారోగ్యం నుంచి కొలుకున్నాక కేంద్ర మంత్రి గడ్కరీ అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. ఈలోగా బెంజ్ సర్కిల్‌పై వంతెన తరహాలో కనకదుర్గ ఫ్లైఓవర్‌పై రాకపోకలు చేసుకోవచ్చని కేంద్రంతో అనుమతులు ఇప్పించినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని కేశినేని నాని అన్నారు.
ఇదీ చదవండి: రైతులకు ఉచితంగా బోర్లు..ఖర్చంతా ప్రభుత్వానిదే: సీఎం