విజయవాడలో మహిళల రక్షణ కోసం కృషి చేస్తానని తెదేపా మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేత హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావటంతో.. పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ స్థలాలను గుర్తించి నగరంలోని.. పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రకటించారు. మేయర్‌గా అధికారం చేపడితే తిరిగి అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తానని చెప్పారు.
ఈ ప్రాంతంలోని మరో డివిజన్లో తెదేపా ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు ప్రచారం చేశారు. డివిజన్లో ప్రధానంగా నాలుగు సమస్యలు ఉన్నాయని.. ఆ సమస్యల పరిష్కారానికి గెలిచినా, ఓడినా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ.. బెదిరింపులతో రౌడీరాజ్యం తెస్తామనడం తగదు: చంద్రబాబు