డయాలసిస్, పేషెంట్లకు తెదేపా ప్రభుత్వ హయాంలో నెలకు 2 వేల 500 అందిస్తే ప్రభుత్వ ప్రకటనలో నిల్ అని చూపించడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తప్పుబట్టారు. గతంలో రెండు వందలుగా ఉన్న పింఛన్‌ను తెదేపా ప్రభుత్వం 2 వేలకు పెంచిందని గుర్తుచేశారు. పింఛన్ లబ్ధిదారులను 54 లక్షలకు పెంచిన ఘనత తెదేపాదేనన్నారు. పింఛన్ 3 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు కేవలం 250 పెంచి వృద్ధులను మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెదేపా పై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారానికి స్వస్తి చెప్పాలన్నారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని కళా హెచ్చరించారు.
పింఛన్లపై వైసీపీ అబద్ధపు ప్రచారం సిగ్గుచేటు: కళా
పింఛన్లపై వైకాపా అబద్ధపు ప్రచారాలతో ప్రజాధనం దుర్వినియోగం చేయటం సరికాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబంధిత శాఖ అధికారులకు న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
డయాలసిస్, పేషెంట్లకు తెదేపా ప్రభుత్వ హయాంలో నెలకు 2 వేల 500 అందిస్తే ప్రభుత్వ ప్రకటనలో నిల్ అని చూపించడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తప్పుబట్టారు. గతంలో రెండు వందలుగా ఉన్న పింఛన్‌ను తెదేపా ప్రభుత్వం 2 వేలకు పెంచిందని గుర్తుచేశారు. పింఛన్ లబ్ధిదారులను 54 లక్షలకు పెంచిన ఘనత తెదేపాదేనన్నారు. పింఛన్ 3 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు కేవలం 250 పెంచి వృద్ధులను మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెదేపా పై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారానికి స్వస్తి చెప్పాలన్నారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని కళా హెచ్చరించారు.
ఇదీ చదవండి: రక్తమోడిన గుంటూరు.. 12 మంది మృతి