ETV Bharat / city

'వర్గమేదో తెలియకుండా ఎస్సీ ఎస్టీ  కేసు ఎలా పెడతారు?' - latest news of journalist st sc case

జర్నలిస్టులపై తుళ్లూరు పోలీసులు పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టేసింది. ఫిర్యాదుదారు ఏ సామాజికవర్గానికి చెందినవారో తెలియకుండా కేసులు పెట్టడం సమంజసం కాదని తెలిపింది. మీడియా ప్రతినిధులపై ఇలా వ్యవహరించడం మంచిది కాదని అభిప్రాయపడింది.

ap highcourt reacts on sc,st cases filed on journalists
జర్నలిస్టులపై నమోదైన కేసులపై హైకోర్టు స్పందన
author img

By

Published : Feb 11, 2020, 11:33 PM IST

Updated : Feb 12, 2020, 4:53 AM IST

రాజధాని పరిధిలో జర్నలిస్టులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై హైకోర్టు స్పందించింది. ఫిర్యాదు చేసిన మహిళా కానిస్టేబుల్ ఏ సామాజికవర్గానికి చెందినవారో తెలియనప్పుడు... వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించింది. ఏ సామాజికవర్గానికి చెందినవారనే విషయంపై ఎలాంటి ఆధారమూ లేదని పేర్కొంది. అందువల్ల జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని తేల్చిచెప్పింది. ఎఫ్​ఐఆర్ నమోదైన ఇతర సెక్షన్లు బెయిలబుల్ స్వభావం ఉన్నందున... తగిన ఫోరాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందవచ్చని సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. రాజధాని పరిధిలోని మందడం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల్ని పోలీసులకు కేటాయించి, పిల్లలకు ఆరుబయట పాఠాలు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు... విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లిన సమయంలో కొంత గందరగోళం నెలకొంది. ఒంగోలు పోలీసు శిక్షణ కేంద్రం నుంచి బందోబస్తు కోసం వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో... జర్నలిస్టులపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఇద్దరు జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున వాదనలు వినిపించిన రాజేంద్రప్రసాద్... జర్నలిస్టులను భయాందోళనకు గురిచేసేందుకే తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు నివేదించారు. ఫిర్యాదుదారు ఏ సామాజికవర్గానికి చెందినవారో తెలియనప్పుడు.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు సరికాదన్నారు. అలాగే ఫిర్యాదు చేయడంలోనూ జాప్యం జరిగినట్లు కోర్టుకు వివరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఎస్సీ, ఎస్టీ కేసు వర్తించదని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి :

ఒకటి కన్నా ఎక్కువ పాన్​కార్డులు ఉంటే రూ.10 వేల జరిమానా

Last Updated : Feb 12, 2020, 4:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.