పోలవరం నిర్మాణం, అమరావతి అంశాలపైనే భాజాపా జాతీయ నాయకులతో జనసేన అధినేత పవన్ చర్చించారని ఆపార్టీ నేత పోతిన మహేశ్ స్పష్టం చేశారు. కేంద్ర పెద్దలు తమ అధినేత చెప్పిన అంశాలపై సానుకూలంగా స్పందించారన్నారు. వైకాపా నేతల స్వార్ధ ప్రయోజనాల కోసమే రాజధాని మార్పు అంశం తీసుకొచ్చారని ఆరోపించారు.
పోలవరం విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జలాశయం ఎత్తుపై వైకాపా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. సీఎం స్పందించి ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు ఆపాలన్నారు. భాజాపా - జనసేన పార్టీలు అమరావతి అంశంపై స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేసి తెలంగాణ సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పాలని హైదరాబాద్ ప్రజలను కోరారు.
ఇదీ చదవండి:
బస్తాల అడుగుల్లో 'మిర్చి వ్యర్థాలు'.. గుంటూరు యార్డులో కల్తీ కథలు