ఎస్సీ, రెల్లి కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారని ప్రభుత్వాన్ని జవహర్ నిలదీశారు. చర్మకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందని, లిడ్ క్యాప్ స్థలాలను ఇళ్ల స్థలాలుగా ఎవరెవరికీ ఇచ్చారని ప్రశ్నించారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, అంబేడ్కర్ విదేశీ విద్య వంటివి ఎంతమందికి అందించారని జవహర్ అడిగారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన రుణాలెన్నని, అన్నింటికీ సమాధానం చెప్పాకే జగన్ తిరుపతిలో ఓట్లు అడగాలన్నారు.
ఇదీ చదవండి: సీబీఐ దర్యాప్తు జరపకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా: ఏబీ వెంకటేశ్వరరావు