Pothina Mahesh: పవన్ కల్యాణ్ సభ, జన సంద్రాన్ని చూసి తాడేపల్లి ప్యాలెస్ ఒక్క సారిగా ఉలిక్కిపడిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. మంత్రి పేర్ని నాని కనురెప్పవేయకుండా జనసేనాని సభ చూసినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ, బావ అనీల్ కుమార్ ప్రచారం వల్లే జగన్ గెలవడం స్పష్టమైందని మహేష్ వ్యాఖ్యానించారు. నవరత్నాల రూపంలో ప్రజలకు తాయిలాలు అందించి మరల అదే ప్రజల నుంచి పన్నుల రూపంలో దోచుకుంటున్నారన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మద్యాన్నే ఆదాయ వనరుగా చూపించి రుణాలు పొందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైకాపా పతనం మొదలైందని జగన్‌కు ఇదే ఆఖరి అవకాశమని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: Bear Attack: అనంతపురం జిల్లాలో రైతుపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు