కాపుల అభివృద్ధి, సంక్షేమంపై సీఎం జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిథి పోతిన మహేశ్ మండిపడ్డారు. కాపుల అభివృద్ధికి కేటాయించిన రూ. 2 వేల కోట్లను అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు మళ్లించి, కాపు సంక్షేమాన్ని విస్మరించారన్నారు. దీనిపై వైకాపా కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పేద కాపు విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించకూడదనే ఉద్దేశంతో విదేశీ విద్యా పథకానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. గతేడాది లబ్ధిదారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసేసి స్వయం ఉపాధి పొందకుండా చేస్తున్నారన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటులో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి...