ETV Bharat / city

'అణగారిన వర్గాలను వైకాపా జెండా మోసే కూలీలుగా చూస్తున్నారు'

వైకాపా ప్రభుత్వం అణగారిన వర్గాలను పార్టీ జెండా మోసే కూలీలుగా చూస్తోందని జనసేన పార్టీ అధికార ప్రతినిథి పోతిన మహేశ్ ఆరోపించారు. సీఎం జగన్ ఆయా వర్గాల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అందరికీ సమన్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

janasena party spokesperson pothina mahesh letter to cm jagan
పోతిన మహేశ్, జనసేన నేత
author img

By

Published : Jun 20, 2020, 7:09 PM IST

ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్(మైనారిటీ)లను ఓటు బ్యాంకుగా చూస్తూ... సంక్షేమ పథకాల ముసుగులో వైకాపా ప్రభుత్వం వారి అభివృద్ధిని పక్కదోవ పట్టిస్తోందని జనసేన పార్టీ అధికార ప్రతినిథి పోతిన మహేశ్ విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు.

అణగారిన వర్గాలను వైకాపా జెండా మోసే కూలీలుగా చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఆయా వర్గాల మీద చూపుతున్నది కపట ప్రేమ కాదా అని ప్రశ్నించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సోదరులు త్వరలోనే సీఎం అసలు రంగును గుర్తిస్తారన్నారు. ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చామని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు వ్యవహారంలోనూ, ఉన్నత సలహాదారుల హోదాలో చేసిన పదవుల పందేరంలోనూ, తాజాగా రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశంలోనూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు.

వైకాపా ప్రభుత్వం ఉన్నది పేద, మధ్య తరగతి వర్గాలను అభివృద్ధి చేయడం కోసం కాదని... కేవలం వారి కుటుంబం, వారి వర్గం అభివృద్ధి మీదే వారి దృష్టి ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.

ఇవీ చదవండి...

'జగన్ పరిపాలన చేయటం లేదు..ఈవెంట్ మేనేజ్​మెంట్ చేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.