ETV Bharat / city

'ఈ ప్రమాదం హృదయవిదారకరం.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి' - స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై పవన్ విచారం వార్తలు

విజయవాడ స్వర్ణపాలెస్​ కొవిడ్ కేర్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన హృదయవిదారకరమని విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

janasena founder pawan kalyan about vijayawada swarna palace covid care centre fire accident
పవన్ కల్యాణ్
author img

By

Published : Aug 9, 2020, 1:16 PM IST

విజయవాడ కొవిడ్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం హృదయవిదారకమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడడం విచారకరమని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. హోటల్ భవనంలో నడుస్తున్న కొవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రమాదాలు జరిగితే బయటపడే అత్యవసర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి? వంటి అంశాలపై లోతైన విచారణ జరపాలన్నారు. ఇలా హోటల్ భవనాల్లో నడుస్తున్న కరోనా కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి...

స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీజీపీ సవాంగ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.