ETV Bharat / city

PAWAN KALYAN: భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా: పవన్‌ కల్యాణ్‌ - latest comments of pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్
author img

By

Published : Sep 29, 2021, 4:17 PM IST

Updated : Sep 29, 2021, 8:37 PM IST

15:01 September 29

pawan kalyan fires on ycp

జనసేన అధినేత పవన్ కల్యాణ్

     'భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తాన'ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకున్నా సినిమాల్లోకి వచ్చానన్న పవన్... సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనలో ఉందని చెప్పారు. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే తాను మాట్లాడతానని, అభివృద్ధి కోసమే 2014లో తెదేపా, భాజపాకు మద్దతిచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోడ్లు వేయటానికీ ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని పవన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తున్నారని నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెతను వైకాపా ప్రభుత్వం నిజం చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు నా వారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకున్నానని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.  

బెదిరిస్తే భయపడం...  

ఐటీ రిటర్న్స్  వివరాల ప్రకారం జగన్ వద్ద రూ.700కోట్లున్నాయని పవన్ అన్నారు. వైకాపా నేతలు ఎప్పుడైనా సైనికులకు రూ.కోటి ఇచ్చారా? అని ప్రశ్నించారు. వైకాపా నేతలు బెదిరిస్తే భయపడటానికి ఇడుపులపాయ ఎస్టేట్ కాదని పవన్ మండిపడ్డారు.    

   భారతీ సిమెంట్స్‌ను అందరికీ ఉచితంగా పంచవచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పని వైకాపా వాళ్లకు సిగ్గుండాలి. ఐటీ రిటర్న్స్‌  వివరాల ప్రకారం జగన్ వద్ద రూ.700 కోట్లున్నాయి. జగన్.. రూ.700 కోట్ల నుంచి పిల్లికి బిచ్చం పెట్టారా? నన్ను తిడితే ఏడుస్తానని వైకాపా నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడకపోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను.. నన్ను లాగితే వదలను. జానీ సినిమా ఫెయిల్‌ అయితే డబ్బులు వాపస్ ఇచ్చా. ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవటానికి ప్రభుత్వం ఎవరు. ఎవరి సొమ్ము అని పథకాలకు సొంత పేర్లు పెడుతున్నారు?. ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వానికి పన్ను కడుతున్నారు. ఓటేసిన వారికే పథకాలు పంచుతాను అనే వైఖరి తప్పు. నచ్చిన వాళ్లకే రేషన్‌, పింఛన్‌ ఇస్తామంటే అడగకుండా ఉంటామా?. కోడి కత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నే లేదు. మీ బాంబుల ముఠాలకు భయపడను. నా జోలికి వస్తే తోలు తీస్తానని వైకాపా వాళ్లకు చెప్పాను. నాకేమైనా థియేటర్లు ఉన్నాయా?. కాకినాడ, నెల్లూరులో మీ నాయకులకు థియేటర్లున్నాయి.   -పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత  

యుద్ధానికి సిద్ధం...

 వైకాపా గ్రామ సింహాల గోంకారాలు, జనసైనికుల సింహ గర్జనలు సహజమని పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే శునకాలని వివరించారు.  కోడి కత్తి కేసు గురించి అడిగితే వైకాపా స్పందించిన తీరు దుర్మార్గంగా ఉందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసు గురించి అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. వైకాపా అధినేత కూడా తన వ్యక్తిగతం గురించి మాట్లాడారన్న పవన్‌... తన తలిదండ్రులు సంస్కారం నేర్పారని,  వైకాపా వారిలా తాను మాట్లాడట్లేదని వివరించారు. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. వైకాపా నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తానన్న పవన్‌... ప్రజాస్వామ్యబద్ధంగా అయినా, వేరే విధంగా అయినా యుద్ధానికి సిద్ధమేనని సవాల్ విసిరారు.  

రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు...  

జీతాలు, ఫించన్లు సకాలంలో ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదని, ప్రజారాజ్యం పార్టీ వేళ తన అన్నయ్య చిరంజీవికి అండగా ఉండాలనుకున్నానని వ్యాఖ్యానించారు. 2014లో తెదేపాకు మద్దతు ఇచ్చినా... ఆ ప్రభుత్వ హయాంలో జనసేన పార్టీ కోసం స్థలం ఇవ్వాలనీ అడగలేదని వెల్లడించారు. తాను ఇచ్చేవాడినే కానీ తీసుకునే వాడిని కానని స్పష్టం చేశారు. జనం కోసం పౌరుషాన్ని తగ్గించుకుంటున్నానని వివరించారు.  

  ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆడపడుచులను తిట్టిస్తారా?. వైకాపా నాయకులకు ఆడబిడ్డల్లేరా? ఇంట్లో ఆడపడుచులు లేరా?. నేను కోట్లు ట్యాక్స్‌ కట్టే సినీరంగం నుంచి వచ్చిన వాడిని. 2014లో చంద్రబాబు నా ఆఫీస్‌కు వచ్చారు. చంద్రబాబును రమ్మనటానికి కారణం మాకు గౌరవం కోరుకోవటమే. నా ఆత్మాభిమానంపై దెబ్బకొడితే అంతే గట్టిగా బదులిస్తా. జగన్ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే ఓ మాట చెప్పా. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని ఆనాడే వైకాపా వాళ్లకు చెప్పా. వైకాపా సర్కార్ అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి. వైకాపా వద్ద కిరాయి ముఠాలు ఎన్ని ఉన్నా భయపడను. భగత్ సింగ్, బోస్, గాంధీలకు తలవంచుతా. వైకాపా నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను.  

            -పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా...

తనను గెలిపిస్తే... అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని పవన్‌ స్పష్టం చేశారు. ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడేలా శాంతిభద్రతలు కాపాడతానని వెల్లడించారు. ఏ కులాన్నైనా అకారణంగా ద్వేషించడం చాలా తప్పన్న పవన్... కాపు ఉద్యమంలో వైకాపా వారే చొరబడి అలజడి సృష్టించారని ఆరోపించారు.  

నన్ను కాపులతోనే కాదు అన్ని కులాలతో తిట్టించండి. ఏ కులం నూరు శాతం ఎవరితోనూ ఉంటుందని అనుకోను. కాపులు నాతో ఉంటే కాకినాడలో ద్వారంపూడి నన్నెలా తిట్టగలిగేవారు?. రంగా సభకొచ్చిన జనాలు ఆయన పక్కన ఉండి ఎందుకు రక్షించుకోలేదు?. ప్రాణహాని ఉందన్న రంగా పక్కన ఎందుకు అందరూ ఉండలేదు?. తుని రైలు ఘటనపుడు వైకాపా వర్గాలు అల్లర్లు రేపాయని సమాచారం. రాయలసీమలో ఎస్సీల హక్కులు కాలరాస్తున్నారు. కులాల తగాదాలతో రాష్ట్ర అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం తగలబెట్టేస్తోంది. నేనెప్పుడూ డబ్బు వెంట పడలేదు. కులాల ఐక్యత అనే మాట నేను ఎప్పుడో చెప్పాను. 151 సీట్లు గెలిచిన పార్టీ.. అందరినీ చంపేద్దామనుకుంటే ఎలా?. అందరినీ భయభ్రాంతులను చేసి పాలించడం సాధ్యమేనా?. ఒక కులాన్ని నిర్మూలించాలని వైకాపా చేసే ప్రయత్నాలు సాగవు. ప్రజాస్వామ్యంలో వైకాపా దౌర్జన్యాలు సాగనే సాగవు. కులాల ఐక్యత అనేది ఏపీ ప్రజలకు తక్షణ ఆవశ్యకం.   -పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

ప్రత్యేక హోదా కోసం పోరాడతా...  

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని భాజపాకు చెప్పినట్లు పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడాతానని మరోసారి ఉద్ఘాటించారు. ప్రత్యేక హోదా విషయంలో నాకు అండగా ఉండాల్సిన వారే బంధాలు వేశారన్న పవన్‌... కేంద్రంతో పోరాడదామంటే తనను గెలిపించలేదని చెప్పారు. విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడినని పవన్ కల్యాణ్ వెల్లడించారు.    

  వైకాపాకు ఓట్లేసి నన్ను పనిచేయమనడం భావ్యమా?. పాతికేళ్లు జనంలో పనిచేస్తానని 2014లో చెప్పా. అన్ని కులాలు ఐక్యంగా ఉండకపోతే ప్రజలే నష్టపోతారు. స్నేహానికైనా, వైరానికైనా నేను సిద్ధమే. నా ఆర్థికమూలాలు దెబ్బకొడతానంటే అభ్యంతరం లేదు. నాకేం ఇడుపులపాయ ఎస్టేట్ లేదు. గత ఎన్నికల్లో ఓటమికి క్షమాపణ చెబుతున్నా. హిందూ మతం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోను. ఏ మతంపై దాడి చేస్తానన్నా సహించను. హిందూ మతంపై దాడిచేసే వారిని ప్రభుత్వం ఎందుకు శిక్షించట్లేదు?. నాపై మతవాది అనే ముద్ర వేయాలని చూసినా భయపడను. లౌకికవాదం అంటే ఏ మతంపై దాడిచేసినా ఖండించాలి. వైకాపా వారు కమ్మవారిని పొద్దున లేచినప్పటి నుంచి తిడుతూ ఉంటారు. రేపు వాళ్లు అధికారంలోకి వచ్చి మిమ్మల్ని తిడితే ఏం చేస్తారు?.  

                     -పవన్ కల్యాణ్, జనసేన అధినేత

వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం...  

   వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారోబోతోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఊహించనివి జరగబోతోందని, ప్రభుత్వాలు మారబోతున్నాయని పవన్ అన్నారు.   

    151 సీట్లు వచ్చిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో 15 రావచ్చు. వైకాపా ఓడిపోయాక కౌరవ సభ పోయి పాండవ సభ వస్తుంది. ఓడిపోతానని నేనూ అనుకోలేదు. వైకాపా ఓడిపోతుందని వారు అనుకోకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది. కావాలంటే నా సినిమాను ఉచితంగా వదిలేయగలను. వైకాపా నాయకత్వానికి సవాల్‌ విసురుతున్నా. మీరా? మేమా? పెట్టుకుందాం రా.. అని సవాల్ చేస్తున్నా. వైకాపా వారి తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతా. ప్రభుత్వ అధికారులూ గుర్తుంచుకోండి. 

                     -పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ప్రాణంపై మమకారం లేదు...  

   ఏపీలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని పవన్‌ కల్యాణ్ ఆక్షేపించారు. ప్రాణంపై మమకారం లేదని చెప్పడానికి చాలా కాలం క్రితమే తుపాకీని వెనక్కి ఇచ్చేశానన్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు తనపై దాడులు చేస్తారని నాడు పోలీసులు హెచ్చరించారని పవన్‌ గుర్తు చేశారు. ఏపీ నుంచి వైకాపా ప్రభుత్వాన్ని పంపాల్సిన సమయం వచ్చిందని పవన్ అన్నారు.   

     ఒక్క కులమే శాసిస్తాను అంటే కుదరనే కుదరదు. అన్ని కులాలు సమానంగా ఉండాలి తప్ప ఒకే కులాధిక్యత తప్పు. కమ్మవారినే లక్ష్యంగా చేసి వైకాపా పనిచేస్తోంది. కమ్మవారిని సమాజం నుంచి తరిమేస్తామని చూస్తే జనసేన సహించదు. యుద్ధానికి రమ్మని వైకాపా మమ్మల్ని ఆహ్వానించింది. ఏపీ నుంచి వైకాపా ప్రభుత్వాన్ని పంపాల్సిన సమయం వచ్చింది. నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోమని సవాల్ చేస్తున్నా. భవిష్యత్తులో మా చేతిలో మీకు ఉందని గుర్తుంచుకోండి. యుద్ధం సైజ్ ఎలా ఉండాలి?.  ఎంత ఉండాలో వైకాపా నిర్ణయించాలి. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి చి‌ట్టా కార్యకర్తలు రాసి పెట్టాలి. కాకినాడలో నాడు జనసేనపై చేసిన దాడిని మరిచిపోయే ప్రసక్తి లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైకాపా నేతలు గుర్తుంచుకోవాలి. బిహార్‌ నుంచి కిరాయి మూకలను కావాలంటే తెప్పించుకోండి. వైకాపా ఛానెల్‌లో జనసేన పేరు చెప్పడానికి ఇష్టపడరు. వైకాపా ఛానెల్‌లో జనసేన పార్టీ పేరు చెప్పేలా చేస్తా. జనసేన గురించి మాట్లాడితే తోలుతీస్తామని చెప్పండి.  

                               -పవన్ కల్యాణ్, జనసేన అధినేత

అనుబంధ కథనాలు...

జనసేన విస్తృతస్థాయి సమావేశం: కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా: పవన్‌ కల్యాణ్‌

JANASENA: పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు: నాదెండ్ల

'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

Last Updated : Sep 29, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.