విజయవాడలో పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయిన పేదలకు తెదేపా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ జగన్ రద్దుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇష్టారాజ్యంగా పింఛన్లు తొలగించటం దారుణమన్నారు. రద్దు చేసిన రేషన్ కార్డులు, పింఛన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: