ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు: నిందితుల వాదనలను వినాలని సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయం

author img

By

Published : Nov 30, 2020, 9:00 PM IST

సీబీఐ ఛార్జ్ షీట్లతో సంబంధం లేకుండా..జగన్ అక్రమాస్తుల ఈడీ కేసులు విచారణ జరపాలన్న అంశంపై వాదనలు వినిపించేందుకు విశ్రాంత ఐఏఎస్​ అధికారి శామ్యూల్​కు న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. వాన్పిక్, రాంకీ, పెన్నా, రఘురాం సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులకు సంబంధించిన సీబీఐ కేసులపై విచారణను న్యాయస్థానం డిసెంబరు 2కు వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు
జగన్ అక్రమాస్తుల కేసు

సీబీఐ ఛార్జ్ షీట్లతో సంబంధం లేకుండా..జగన్ అక్రమాస్తుల ఈడీ కేసులు విచారణ జరపాలన్న అంశంపై వాదనలు వినిపించేందుకు విశ్రాంత ఐఏఎస్​ అధికారి శామ్యూల్​కు న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లోని ఇండియా సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో నిందితుడిగా శామ్యూల్ ఉన్నారు. కేసులను ఎలా విచారించాలన్న దానిపై నిందితులందరి వాదనలు వినాలని హైదరాబాద్ సీబీఐ, ఈడీకోర్టు నిర్ణయించింది. అందుకు గడువు కావాలని శామ్యూల్ తరఫు న్యాయవాది ఇవాళ మరోసారి కోరగా.... ఇదే చివరి అవకాశమని మరోసారి వాయిదా ఇవ్వబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వ్యాజ్యాలపై విచారణ సైతం అదే రోజుకు వాయిదా పడింది. వాన్పిక్, రాంకీ, పెన్నా, రఘురాం సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులకు సంబంధించిన సీబీఐ కేసులపై విచారణను న్యాయస్థానం డిసెంబరు 2కు వాయిదా వేసింది.

ఇదీచదవండి

'అమరావతి ముంపు ప్రాంతమని చెప్పి.. కడపను ముంచేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.