ETV Bharat / city

BOPPARAJU ON PRC: రేపటి సంయుక్త భేటీలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం: బొప్పరాజు - ఎపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు

JAC AMARAVATHI LEADER BOPPARAJU ON PRC GOs: జీవోలు రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని ఎపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జీతాలు తగ్గించి అలవెన్సుల్లోనూ కోత వేయడం వల్లే సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. గురువారం జరిగే ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంయుక్త భేటీలో తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు అన్నారు.

BOPPARAJU ON PRC
BOPPARAJU ON PRC
author img

By

Published : Jan 19, 2022, 9:35 PM IST

JAC LEADER BOPPARAJU ON CS SAMEER SHARMA: ఉద్యోగుల వేతనాలపై సీఎస్ సమీర్ శర్మ దుర్మార్గంగా మాట్లాడారని ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఫిట్​మెంట్​తో జీతాలు తగ్గుతుండగా.. డీఏలు ఎరగా చూపి జీతాలు పెరిగుతాయని సీఎస్ అనడం దారుణమన్నారు. ఈ ఫిట్​మెంట్ అమలు చేస్తే ప్రతి ఉద్యోగికి వేతనాలు తగ్గుతాయని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాకు జీతాలు తగ్గవని మీరు అనుకుంటే మాకు పాత జీతాలే ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. రివర్స్ పీఆర్సీ తమకు వద్దని, ఇస్తే పాత జీతాలు ఇవ్వాలని కోరారు.

జీవోలు రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని.. దుర్మార్గపు ఆలోచనలకు వ్యతిరేకంగా సమ్మె చేయనున్నట్లు తెలిపారు. తమ వేతనాల పెంపు కోసం కాదని.. జీతాల్లో కోత పెట్టడం సహా గతంలో ఇచ్చిన అలవెన్సులను రద్దు చేసినందున సమ్మెకు వెళ్తున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో బొప్పరాజు తెలిపారు.

జీతాలు తగ్గించి అలవెన్సుల్లోనూ కోత వేయడం వల్లే సమ్మె

గురువారం సాయంత్రం 5 గంటలకు ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంయుక్త భేటీ జరగనుంది. భేటీ అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. సమ్మెకు ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఆర్టీసీలోని అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటాయి. ఉద్యమంలోకి అడుగుపెడితే వెనక్కి తగ్గేది ఉండదు. మేము చేయబోయే సమ్మె తీవ్ర రూపం దాల్చుతుంది. మా ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. జీవోలు రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపీ జేఎసీ అమరావతి ఛైర్మన్

ఇదీ చదవండి.. BANDI SRINIVAS RAO : 'ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.