వైకాపా ఏడాదిన్నర పాలనలో 7 విపత్తులు సంభవించాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. వాటితో నష్టపోయిన 40 లక్షల ఎకరాలకు ఎంత పరిహారం చెల్లించారో మంత్రి కన్నబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 50 శాతం పంట నష్టపోయినా... వైకాపా ప్రభుత్వం లెక్కించట్లేదని విమర్శించారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని చెప్పే ధైర్యం మంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేయటమే రైతు సంక్షేమమా ? అని నిలదీశారు.
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు గురించి మాట్లాడిన ఎస్సీ రైతు జైపాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. మంత్రి కన్నబాబు చెప్పేదొకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతోంది మరొకటన్న ఏలూరి...ఒట్టి మాటలు కట్టిపెట్టి వరదలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని హితవు పలికారు.
ఇదీచదవండి
ఉపాధ్యాయ బదిలీల్లో కొంత మేర ఖాళీలను బ్లాక్ చేశాం: మంత్రి సురేశ్