కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం-2020 పై నిర్వహిస్తున్న గవర్నర్ల సదస్సులో పాల్గొనాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆహ్వానం పలికారు. ఈ నెల 7వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సు నిర్వహించనున్నారు. సమావేశంలో పాల్గొని అభిప్రాయాలు పంచుకోవాలని గవర్నర్‌ను రాష్ట్రపతి కోరారు.
గవర్నర్ల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యాశాఖ కార్యదర్శులు పాల్గొంటారు. నూతన విద్యావిధానం అమలుపై లోతైన చర్చకు ఈ సమావేశం ఉపకరిస్తుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: