ETV Bharat / city

Durga Temple: ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం..పోలీసుల దర్యాప్తు - దుర్గ గుడి వద్ద అన్యమత ప్రచారం

Durga Temple
Durga Temple
author img

By

Published : Oct 8, 2021, 3:05 PM IST

Updated : Oct 8, 2021, 6:29 PM IST

15:04 October 08

ఇంద్రకీలాద్రిపై ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనలపై ఈవో దృష్టి

సోమినాయుడు, పాలకమండలి ఛైర్మన్‌

ఇంద్రకీలాద్రిపై (durga temple) ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనలపై ఈవో భ్రమరాంబ దృష్టి సారించారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకమా? పొరపాటున జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దుర్గగుడి (durga temple) ఈవోకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ హామీ ఇచ్చారు.  

'అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలను ఉపేక్షించం. దర్శనానికి వచ్చి రాజకీయ విమర్శలు చేయడం తగదు.' - సోమినాయుడు, పాలకమండలి ఛైర్మన్‌ 

అసలేం జరిగింది.. 

విజయవాడ కనకదుర్గ ఆలయం  (durga temple) పరిసరాల్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని గురువారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులతో కలకలం రేగింది. దుర్గమ్మ ఆలయంలో దసరా వేడుకలకు సంబంధించి ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలను ఓ ప్రైవేటు ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆలయ పరిసరాల్లోని కెనాల్‌రోడ్డు వినాయకుడి గుడి, దుర్గాఘాట్‌ పరిసరాల్లో డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 వరకూ ఆలయ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల అనంతరం ఆ ఛానల్‌ సాధారణ కార్యక్రమాల ప్రసారం మొదలైంది. అందులో భాగంగా ఓ అన్యమత కార్యక్రమం వచ్చింది. ఇది గమనించిన కొందరు సామాజిక మాధ్యమాల్లో దుర్గగుడి పరిసరాల్లో అన్యమత ప్రచారం అంటూ పోస్టులు పెట్టారు. దీనికి గమనించిన అధికారులు అప్రమత్తమై ప్రసారాలను నిలుపుదల చేశారు. పొరపాటున జరిగిందంటూ వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: 

ఇంద్రకీలాద్రిపై జేసీ శివశంకర్‌ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

Last Updated : Oct 8, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.