ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ(ఐసీఐడీ) నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో అత్యంత పురాతనమైన కడప జిల్లాలోని పోరుమామిళ్ల చెరువు, ప్రకాశం జిల్లాలోని కంభం చెరువు, కర్నూలు-కడప కెనాల్‌ను వారసత్వ కట్టడాలుగా ప్రకటించారని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాగునీటి వారసత్వ కట్టడాలుగా 14 ఎంపిక కాగా.... అందులో మన దేశానికి నాలుగు వచ్చాయని చెప్పారు. మహారాష్ట్రకు ఒక అవార్డు లభించగా... మిగిలిన మూడు అవార్డులు రాష్ట్రానికే దక్కడం విశేషమన్నారు.
13వ శతాబ్దంలో పోరుమామిళ్ల చెరువు, 15వ శతాబ్దానికి చెందిన కంభం చెరువు, 18వ శతాబ్దంలో నిర్మించిన కేసీ కెనాల్‌లు వారసత్వ కట్టడాలుగా స్థానం సంపాదించాయన్నారు. 2023లో ఐసీఐడీ సదస్సు విశాఖలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన అభ్యర్థనను అంగీకరించారని.. ఈ సదస్సుకు 400 మంది విదేశీ ప్రతినిధులు.. మరో 500 మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు హాజరవుతారన్నారు. నీటి మూల్యాంకణం, పరిమితంగా నీటి వాడకం, నీటి సంరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చ జరుగుతుందన్నారు. విదేశాల్లో అనుసరిస్తోన్న పద్ధతులు, సాగునీటి వ్యవస్థలో ఇతర రాష్ట్రాలు ఆచరిస్తున్న విధానాలు తెలుసుకుని రాష్ట్రంలో సమగ్ర సాగునీటి విధానాన్ని అమలు చేయొచ్చని మంత్రి అనిల్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: పోలవరంలో స్వీటీ... ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా