Inter exams: ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం యథావిధిగా కొనసాగుతాయని.. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారం, వదంతులను నమ్మవద్దని వెల్లడించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ద్వితీయ సంవత్సరం గణితం, వృక్ష, పౌరశాస్త్రం పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను అసని తుపాను కారణంగా ఈ నెల 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: