ETV Bharat / city

HIGH COURT VERDICT: ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారితే ఎలా?.. - హైకోర్టు తీర్పు సర్కారు తీరు

HIGH COURT VERDICT: అమరావతి ఉద్యమం 900వ రోజుకు చేరిన సందర్భంగా ‘హైకోర్టు తీర్పు -సర్కారు తీరు’ అన్న అంశంపై శనివారం విజయవాడలో నిర్వహించిన మేధావుల సదస్సులో పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, విధానాలు మార్చేస్తే భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

HIGH COURT VERDICT
ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారితే ఎలా?..అమరావతి బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి
author img

By

Published : Jun 5, 2022, 7:15 AM IST

HIGH COURT VERDICT: వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం చరిత్రాత్మక తప్పిదమని పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, విధానాలు మార్చేస్తే భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం 900వ రోజుకు చేరిన సందర్భంగా ‘హైకోర్టు తీర్పు -సర్కారు తీరు’ అన్న అంశంపై శనివారం విజయవాడలో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాజధానిపై ఏపీ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించి, రాజ్యాంగ స్ఫూర్తితో మంచి తీర్పును వెలువరించింది. నేను నాలుగేళ్ల క్రితం రాజధానిలో పర్యటించినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. పనుల్లో కదలిక లేదు. ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. ఇంత భారీ కట్టడాలు నిరుపయోగమవుతున్నాయని మాలాంటి వారికి బాధగా ఉంది. కోర్టు తీర్పు వచ్చాక కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. గత ప్రభుత్వాల నిర్ణయాలను గౌరవించాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం శ్రేయస్కరం కాదు.

రాజధాని విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని భావించి పక్కన పెట్టేయడం ఇంకా పెద్ద తప్పు. హైకోర్టు తీర్పునే అమలు చేయకపోతే, ప్రజలకు మీ ప్రభుత్వంపైనా, న్యాయ వ్యవస్థపైనా, అసలు ఏ వ్యవస్థపైనా విశ్వాసం ఉండదు. వ్యవస్థలపై నమ్మకం పోతే పరిపాలన కష్టమవుతుంది. హైకోర్టు, అసెంబ్లీ, మండలి, సచివాలయం.. ఇలా అన్నీ అమరావతి నుంచి నడుస్తున్నప్పుడు మూడు రాజధానుల నిర్ణయం చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. నిజంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెట్టొచ్చు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకల్లో కూడా అలాంటి ఏర్పాటు ఉంది. శాసనసభ సమావేశాలు కూడా కొన్ని రోజులు వేరేచోట నిర్వహించొచ్చు. రాష్ట్రానికి రాజధాని అవసరం. అది మిగిలిన ప్రాంతాలకు దగ్గరా దూరమా అన్నది ప్రజలు ఆలోచించకూడదు. అమరావతి రాజధాని అన్న నిర్ణయానికి అందరూ మద్దతిచ్చి, వారివారి ప్రాంతాల అభివృద్ధి జరిగేలా ఒత్తిడి తేవాలి. అంతిమంగా ప్రజల అభివృద్ధి, బాగోగుల గురించే పాలకులు ఆలోచించాలి. రాజధాని సీఎం వ్యక్తిగతం కాదని గుర్తుంచుకోవాలి’ అని హరగోపాల్‌ పేర్కొన్నారు.

మూడు రాజధానులు కుదరదు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటే దాని కోసం రాజధానిని ముక్కలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుందన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు కుదరదన్నారు. అవసరమైతే హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘అమరావతిని అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతులతో చర్చించి రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి. నేను రెండేళ్ల క్రితం రాజధానిలో పర్యటించాను. ప్రభుత్వం మారడంతో తమ కలలు కల్లలయ్యాయని, భూములూ పోయాయనీ, రాజధానీ రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే ఉంటుందన్న కృతనిశ్చయం ఇప్పుడు వారిలో కనిపిస్తోంది. హైకోర్టు కూడా అన్ని కోణాల్లో పరిశీలించి మంచి తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం రైతుల నుంచి భూములు సమీకరించి, నిర్మాణాలపై రూ.15 వేల కోట్ల వరకు వెచ్చించింది. ఇప్పుడు వైకాపా అక్కడ రాజధాని కట్టబోమంటే ఎలా? జీవనాధారమైన భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతుల భవిష్యత్తంతా ఇప్పుడు ఆ నగరాభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గత ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే తప్ప, దాన్ని తిరగదోడకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉందని, మూడు అని ఎక్కడా పేర్కొనలేదని గుర్తు చేసింది. కోర్టు అంత స్పష్టంగా చెప్పాక వైకాపా ప్రభుత్వానికి వెనక్కి వెళ్లే దారి లేదు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో నే కేంద్రీకృతమైంది. ఇక్కడ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా పరిశ్రమను ఒక ప్రాంతంలో, ఐటీ రంగాన్ని మరో ప్రాంతంలో, పరిశ్రమలు ఇంకో ప్రాంతంలో ఉండేలా చూస్తే ఫలితం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేదు

రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేదని, రాజధానిపై హైకోర్టు అంత స్పష్టమైన తీర్పు చెప్పాక కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఉండేందుకు మార్గాలు అన్వేషిస్తోందని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు పేర్కొన్నారు. తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి లేనందువల్లే దాన్ని వాయిదా వేసేందుకు సాకులు వెతుకుతోందన్నారు. ‘ప్రభుత్వం శాసనసభలో మూడు రాజధానుల బిల్లు పెట్టగానే కోర్టులో సవాల్‌ చేశాం. శాసనసభలో బిల్లు ఆమోదం పొందిందని, మండలి సెలక్ట్‌ కమిటీకి పంపించిందని ఆ రోజు హైకోర్టులో అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్‌ కమిటీ నుంచి రాకుండానే, 90 రోజుల గడువు ముగిసిందంటూ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రెండోసారి మండలిలో బిల్లు పాస్‌ చేసింది. తర్వాత బిల్లు చట్టమైంది. దాన్నీ కోర్టులో సవాలు చేశాం. మూడు రాజధానులు ఖర్చుతో కూడుకున్నదని, ప్రజల సొమ్ము వృథా అవుతుందని వాదించాం. వాదనలు ముమ్మరంగా సాగుతూ, కొలిక్కి వస్తున్న తరుణంలో ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఫుల్‌ బెంచ్‌లో ఉన్న అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై సీజేఐకు ఫిర్యాదు చేసి, ఆయన్ను బదిలీ చేయించే ప్రయత్నాల్లో సఫలమైంది. బెంచిలోని ఇద్దరు న్యాయమూర్తులకు రాజధానిలో ఆర్థికపరమైన ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, వారు ఈ కేసు వినేందుకు వీల్లేదని రెండో అభ్యంతరం లేవనెత్తింది. చట్టాన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని, తీర్పు ఇవ్వొద్దని కోర్టులో చెప్పి మూడో ప్రయత్నం చేసింది. చివరకు వాదనలన్నీ పూర్తయి హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం నెల రోజుల్లో రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వాలి. మేం కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసేలోగానే.. ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. తమ దగ్గర అంత డబ్బు లేదని, అభివృద్ధికి పెట్టిన గడువును ఎత్తేయాలని కోరింది’ అని అన్నారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల వారికి రాజధాని ఎక్కడున్నా పట్టదు

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు స్థితప్రజ్ఞులని.. రాజధాని ఈ ప్రాంతంలో పెడతామన్నా పట్టించుకోరని, వేరే ప్రాంతానికి తరలిస్తున్నామన్నా స్పందించరని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ పెడితే అక్కడికి తామే వస్తామంటారన్నారు. రాజధానిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం తూచ తప్పక అమలు చేయాలన్నారు. ‘మన ముఖ్యమంత్రి అదృష్టవంతులు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉంది. ఆయనను పెద్ద కొడుకులా భావిస్తున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే, ముఖ్యమంత్రిని ఎవరూ వేలెత్తి చూపరు. తనకు ఇష్టం లేకపోయినా కోర్టు తీర్పుతో చేయాల్సి వస్తోందని చెప్పొచ్చు. అసలు రాజధానే లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం నిరూపించింది. రాజధాని లేకుండా పరిపాలన చేయొచ్చని ముఖ్యమంత్రి జగన్‌ నిరూపించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని భాజపా కాకినాడలో తీర్మానం చేసింది. కానీ రాష్ట్రం విడిపోతే ఏపీకి రాజధాని ఎక్కడో నిర్ణయించకపోవడం భాజపా చేసిన తప్పు.

రాజధాని ఎక్కడో చెప్పకుండా పార్లమెంటులో బిల్లు పెట్టడం కాంగ్రెస్‌ తప్పు. మేం చాలా పీడనకు గురయ్యామని తెలంగాణ వాళ్లు అనుకుంటారు. కానీ వారు అదృష్టవంతులని నేను చెబుతాను. ఎందుకంటే వారిని 600 ఏళ్లు పాలించింది మూడు నాలుగు వంశాల వారే. కానీ ఆంధ్రులను 66 వంశాల వారు పాలించారు. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేశారు. భాజపాకు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పారు. ఆ తర్వాతే సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజనకు మోదీ కారణం. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రధాని మంచి చేయాలి. పోలవరం, అమరావతి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యమంత్రి హోదాలో 40 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని కేంద్రాన్ని మొదటి అడిగింది రాజశేఖర్‌రెడ్డే. మూడు రాజధానుల పేరుతో మరో విభజనవాదానికి జగన్‌ తెరతీశారు. అలా ఆంధ్రజాతి విచ్ఛిన్నానికి రాజశేఖరరెడ్డి వంశమే కారణమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.