ETV Bharat / city

'పరిశ్రమలను ఆకట్టుకునేలా నూతన పారిశ్రామిక విధానం' - పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి న్యూస్

పరిశ్రమలను ఆకట్టుకునేలా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి గౌతమ్​రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల టాస్క్​ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. చైనా నుంచి భారత్​కు తరలివచ్చే పరిశ్రమలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నామన్నారు.

'పరిశ్రమలను ఆకట్టుకునేలా నూతన పారిశ్రామిక విధానం'

author img

By

Published : Jun 4, 2020, 3:10 PM IST

కరోనా కారణంగా చైనా నుంచి భారత్​కు తరలివచ్చే పరిశ్రమలను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్​రెడ్డి స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే నూతన పారిశ్రామిక విధానం ఉంటుందని వెల్లడించారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్​లో నిర్వహించిన పరిశ్రమల టాస్క్​ఫోర్స్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఇక్కడికి వచ్చే పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు, నైపుణ్యం ఉన్న వర్క్​ఫోర్స్​ను పరిశ్రమలకు అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. మరో వైపు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.., ఎన్​జీటీ ఆదేశాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదంపై విచారణ నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందలేదన్నారు.

ఇదీ చదవండి: 'ఇకపై సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.