శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకోవాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ డిమాండ్ చేశారు. వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు తితిదేకు లేదన్న ఆయన.. ఆస్తులను పరిరక్షించుకోలేక అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు.
భూములు నిరర్ధకమైనవని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం దారుణమని విమర్శించారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములపై అధికార పార్టీ కన్ను పడిందని ఆరోపించారు.
ఇవీ చదవండి: