ETV Bharat / city

తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు! - telangana latest news

తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది.

తెలంగాణలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు!

author img

By

Published : Feb 16, 2021, 4:45 PM IST

తెలంగాణలో ఈనెల 18న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్​, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో... రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో.. సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ఇవాళ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

కింది స్థాయి, తూర్పు గాలుల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి.. దక్షిణ కొంకణి నుంచి మధ్య మహారాష్ట్ర మీదుగా విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవీచూడండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టవద్దు..: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.