విజయవాడ టూటౌన్ కొత్తపేట సీఐ ఉమర్, ఎస్ఐ విశ్వనాధ్ ఆధ్వర్యంలో వించిపేటలోని ఓ గృహంలో మద్యం దాచి ఉంచారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. తెలంగాణా మద్యం 279 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉమర్ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం లేనందునే అక్రమ మద్యం రవాణా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటునట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. యవకులు చెడు మార్గాలాలో వెళ్ళి చిక్కులు కొని తెచ్చుకోవద్దని సీఐ ఉమర్ కోరారు.
ఇదీ చదవండి 'రాష్ట్రంలో బలహీనవర్గాలపై దాడులు పెరిగాయి..'