రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండేను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అటవీశాఖలో చీఫ్ కన్జర్వేటర్‌గా పని చేస్తున్న రాహుల్ పాండేను గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో ఉచితంగా ఇళ్ల నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో వేగవతం చేయాలనే ఉద్దేశంతో గృహ నిర్మాణశాఖకు ప్రత్యేక కార్యదర్శిని నియమించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..