ETV Bharat / city

'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం' - న్యాయుమూర్తులపై సీఎం జగన్ కామెంట్స్

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంపై దేశ వ్యాప్తంగా న్యాయ విద్యార్థులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. భారత స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఈ స్థాయిలో దాడి జరుగుతుంటే కళ్లు మూసుకుందామా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి.. ఫాసిస్టు ధోరణితో..తన ప్రతీకార రాజకీయాలకు న్యాయవ్యవస్థను వేదిక చేయాలని చూస్తున్నారని.. దీనిని ఏమాత్రం సహించరాదని అన్నారు. జస్టిస్ ఎన్వీరమణతో పాటు, ఇతర న్యాయమూర్తులపై చేసిన కుట్రపూరిత, ఆధారరహిత ఆరోపణలను అనుమతించకూడదంటూ.. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 100 మంది న్యాయవిద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

author img

By

Published : Oct 17, 2020, 4:05 PM IST

Updated : Oct 17, 2020, 4:51 PM IST

సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి, తదుపరి సీజీఐగా అందరూ భావిస్తున్న జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు, రాష్ట్ర హైకోర్టులోని కొంతమంది న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ఈనెల 6న సీజేఐకు రాసిన లేఖపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయనిపుణులు ముఖ్యమంత్రి చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా దేశవ్యాప్తంగా ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన వందమంది విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్ మోహన్​ రెడ్డి తీరును తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖరాశారు. ముఖ్యమంత్రిది దౌర్జన్యపూరిత, నిరంకుశ, ఫాసిస్టు ధోరణి అంటూ తీవ్రపదజాలంతో తమ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చర్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, ఔన్నత్యానికి భంగకరమని ఆక్షేపించారు.

న్యాయవ్యవస్థకు బెదిరింపు..

ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు న్యాయవ్యవస్థను బెదిరింపులకు గురిచేసే విధంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గౌరవానికి భంగం కలిగేవిధంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోందని న్యాయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. "స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది రాజ్యాంగంలో అత్యంత మౌలికమైన అంశమని, ప్రజాస్వామ్య పరిరక్షణలో అది ముఖ్యమైనదని, ప్రజల హక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ ముఖ్యమైనదని మేం తరగతి గదుల్లో చదువుకున్నాం. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాక, దాని గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. దీనిని ఇలాగే సహించి వదిలేస్తే.. ప్రజల్లో న్యాయవ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోవడానికి కారకులం అవుతాం" అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్​ రెడ్డి న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేస్తూ.. సీజేఐకు రాసిన లేఖ కచ్చితంగా న్యాయవ్యవస్థపై దాడే" అని విద్యార్థులు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నిందితుడే ఆరోపిస్తారా..?

అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థను బెదిరించేందుకే సీజేఐకు లేఖ రాశారని విద్యార్థులు లేఖలో ప్రస్తావించారు. "సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఏపీ హైకోర్టు కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో పాటు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రాకేష్ (లేఖలో రమేష్ అనిరాశారు..)లపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు. వాస్తవానికి ముఖ్యమంత్రే 31 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన నమోదు చేసిన 11కేసులు, ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన 7 కేసులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై పెండింగ్​లో ఉన్న నేరాలకు సంబంధించిన విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ జస్టిస్ ఎన్వీరమణ ఇటీవలే రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలిచ్చారు. జస్టిస్ ఎన్వీరమణపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశ్యాలు ఏంటో ఇక్కడే అర్థమవుతోంది" అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్, జస్టిస్ వినీత్ శరణ్​లపై ఇలాగే ఆధారరహితమైన ఆరోపణలు చేస్తే.. సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందని విద్యార్థులు లేఖలో ప్రస్తావించారు.

న్యాయాన్ని నిలబెడుతున్నాయి..

కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న ఈ తరుణంలోనూ.. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు న్యాయాన్ని నిలబెడుతోందని విద్యార్థులు తెలిపారు. "రాష్ట్రప్రభుత్వ అనైతిక, ప్రతీకార చర్యలను తట్టుకుంటూ కూడా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షిస్తున్నారని విద్యార్థులు కొనియాడారు. రాష్ట్రప్రభుత్వ ప్రతీకార చర్యలను తట్టుకుంటూ రాష్ట్రంలో న్యాయబద్ధమైన పాలనను కాపాడటానికి హైకోర్టు చేస్తున్న ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతుందని.. ఇతర రాష్ట్రాల హైకోర్టులు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని వారు అన్నారు. ప్రభుత్వ చర్యలను ఇలాగే ఉపేక్షిస్తే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సమాధి కట్టినట్లే అని" వారు వ్యాఖ్యానించారు.

వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం..

దీనిని ఏ ఒక్క న్యాయమూర్తికో జరుగుతున్న విషయంగా చూడరాదని... న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే రాజకీయ చర్యలను ఏమాత్రం అనుమతించరాదని వారు కోరారు. "న్యాయమూర్తులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతం. న్యాయవ్యవస్థ స్వతంత్రతను్ కాపాడతామని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన వారు మౌనంగా ఉంటే ఆ విషయం చరిత్ర గుర్తుంచుకుంటుంది. అధికారం అండతో.. ఒక ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థపై దాడి చేస్తుంటే.. మౌనంగా సహిస్తూ ఉండటం ఏ మాత్రం వాంఛనీయం కాదు" అని లేఖలో అన్నారు

ఇలాగే సహిద్దామా..?

న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడులను విద్యార్తులు తీవ్రంగా నిరసించారు. ఇవి చాలా ఏళ్లుగా జరుగుతున్నాయని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్​ రెడ్డి ధోరణి వాటన్నింటినీ మించి పోయిందని ఆక్షేపించారు. ఆయన చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తున్నాయని అన్నారు. "అత్యున్నత న్యాయవ్యవస్థపై ఆధిపత్యం చూపించాలన్న ప్రయత్నాలు ఇవాల్టివి కాదు. ఇంతకు ముందు నుంచీ జరుగుతున్నాయి. కానీ దీనిపై మనం మౌనం వహిస్తే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను.. ఒక ఫాసిస్టు ముఖ్యమంత్రికి ధారాదత్తం చేసినట్లు అవుతుంది. కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఇది జస్టిస్ ఎన్వీరమణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. కాబోయే ప్రధాన న్యాయమూర్తి గౌరవానికి సంబంధించిన విషయం. సుప్రీంకోర్టు భవిష్యత్ కు సంబంధించిన విషయం. రాజకీయ అధికారంతో దౌర్జన్యపూరితంగా, ఫాసిస్ట్ ధోరణితో రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఈ ముఖ్యమంత్రి ధోరణిని ఇలాగే సహిద్దామా..? " అని ప్రశ్నించారు. విఖ్యాత న్యాయకోవిదుడు జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. "అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్న వారు రాజకీయ నాయకులకు సేవకులుగా ఉంటే.. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. రాజ్యంలో అన్ని విభాగాలు రాజ్యాంగంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అప్పుడు చట్టపరమైన గందరగోళం, రాజ్యాంగ సంక్షోభం తలెత్తుందని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా చెప్పారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం... రాష్ట్రంలో న్యాయపరమైన , రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తాలని కోరుకుంటున్నారని " లేఖలో ఆక్షేపించారు.

సరైన చర్యలు తీసుకోండి..

ఈ ధోరణిని ఇలాగే సహిస్తూ వెళితే.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా మనగలుగుతుందా అని విద్యార్థులు ప్రశ్నించారు. ఇది కేవలం జస్టిస్ ఎన్.వి.రమణ గురించి మాత్రమే కాదు. ఇవాళ ఆయన.. రేపు మరొక న్యాయమూర్తి అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా మనగలుగుతుందా.. ? న్యాయమూర్తులు భయంలేకుండా రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా నిస్పాక్షికమైన తీర్పులు ఇవ్వగలుగుతారా..? న్యాయవ్యవస్థపై ఇంత దాడి జరుగుతున్నా మనం కళ్లు మూసుకుందామా..? సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై కుట్రపూరితంగా .. దురుద్దేశపూర్వకంగా అపవాదు వేస్తూ.. ముఖ్యమంత్రి రాసిన లేఖపై సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.." అని విద్యార్థులు లేఖను ముగించారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా వీరు లేఖలో ప్రస్తావించారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు న్యాయమూర్తులపై దాడులకు వేదికగా మారుతున్నాయని తప్పుపట్టారు. పలు జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాలు సహా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన న్యాయ కళాశాలల నుంచి వందమంది విద్యార్థులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

ఇదీ చదవండి:

'న్యాయమూర్తులపై ఏపీ ప్రభుత్వ ఆరోపణలు కచ్చితంగా కోర్టు ధిక్కరణే'

Last Updated : Oct 17, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.