ETV Bharat / city

పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్​లో మార్పులు

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్​గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్​ను నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ ఆదేశాలు జారీ చేశారు.

ap govt oredrs issued for ias officers trasnfer
పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్​లో మార్పులు
author img

By

Published : Feb 3, 2021, 6:19 PM IST

ఎస్ఈసీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్​గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఆయన సేవల్ని అటవీ, పర్యావరణ శాఖలోని కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగానూ, అలాగే ఎక్సైజ్​ శాఖ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు ఎక్సైజు శాఖ కమిషనర్ బాధ్యతల్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్​కు అప్పగించారు. అలాగే రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ బాధ్యతల్ని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా ఉన్న జీఎస్ఆర్ కేఆర్ విజయకుమార్​కు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చదవండి: నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.