Huge rush at keesara toll plaza: సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన వారితో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. దీంతో.. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలు కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద బారులు తీరాయి. హైదరాబాద్ వైపు వాహనాలు వెళ్లేందుకు వీలుగా నాలుగు లైన్లు ఏర్పాటు చేశారు.
కిక్కిరిసిన కడప బస్ స్టాండ్..
Rush at kadapa bus stand: ప్రయాణికులతో కడప జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. జిల్లావ్యాప్తంగా 8 డిపోల పరిధిలో తిరుగు ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు 190 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. కడప కేంద్రం నుంచి కర్నూల్, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైదరాబాద్ కు వంద బస్సులు, బెంగళూరుకు 70, చెన్నై 10, విజయవాడకు 10 చొప్పున బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని అదనపు సర్వీసులను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఇదీ చదవండి: