విజయవాడ టూటౌన్లోని పొట్టి శ్రీరాములు కళాశాల ప్రాంగణంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్ధానిక కార్పొరేటర్ అభ్యర్ధితో పట్టాలు పంపిణీ చేయటాన్ని సీపీఐ నాయకులు వ్యతిరేకించారు. మంత్రిని సభలో నిలదీయటంతో.. సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకుని రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ స్టేషన్ ముందు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ కార్పొరేటర్ అభ్యర్దులతో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయించటం దారుణమన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ రాజకీయ వేదికగా మార్చుకుంటే అడ్డుకొని తీరుతామని సీపీఐ నాయకులు ప్రకటించారు.
ఇదీ చదవండి:
భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు: భానుప్రకాశ్