అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే ప్రభుత్వ ఆలోచన అని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అందుకే విశాఖను పరిపాలన రాజధానిగా... శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటును చేస్తున్నామన్నారు. అమరావతిలో తెదేపా అభ్యర్థుల ఓటమి ద్వారా ప్రజలు తీర్పు చెప్పారని విమర్శించారు. అమరావతిలో 50 వేలమందికి పట్టాలిస్తుంటే చంద్రబాబు కోర్టుకెళ్లారని ఆక్షేపించారు.
108, 104 వాహనాలకు రూ.200 కోట్లయితే...300 కోట్ల అవినీతి జరగిందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే తప్పుబడుతున్నారని... నేరం చేసిన వాళ్లను వదిలేయాలని తెదేపా నేతలు కోరుతున్నారా? అని సుచరిత ప్రశ్నించారు.