ETV Bharat / city

తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్​ 8 వరకు స్టే - high court on non agriculture registrations in dharani news

తెలంగాణలో ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను ఈనెల 8 వరకు పొడిగిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్​ 8 వరకు స్టే

author img

By

Published : Dec 3, 2020, 7:41 PM IST

తెలంగాణలో ధరణిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ... దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఎదుట ఇవాళ మరోసారి సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు. ధరణిలో ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియకు స్పష్టమైన చట్టబద్ధత లేదని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ప్రకాశ్​ రెడ్డి వాదించారు. సేకరించిన డేటాకు భద్రత లేదన్నారు. అంతా చట్టప్రకారమే ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి వాదనల కోసం విచారణను హైకోర్టు ఈనెల 8వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.