ETV Bharat / city

ఆ మూడు జిల్లాల్లో కరోనా తీవ్రతకు కారణాలేంటి?: హైకోర్టు

చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొవిడ్ కేసుల శాతం అధికంగా ఉండటానికి కారణాలు అన్వేషించాలని.... రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా కట్టడికి సూక్ష్మ నిర్వహణ చర్యలు తీసుకోవాలని... అవసరమైతే వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని నిర్దేశించింది. 15 రోజులుగా జిల్లాలవారీ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య, తీవ్రత ఎక్కువున్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసున్నారనే వివరాల్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

corona
కరోనా కేసులపై హైకోర్టు
author img

By

Published : Jul 10, 2021, 5:56 AM IST

మూడు జిల్లాల్లో కొవిడ్ కేసుల శాతం అధికంగా ఉండటంపై హైకోర్టు ఆగ్రహం

కార్పొరేట్ ఆసుపత్రుల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ... ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని పాత్రికేయుడు తోట సురేశ్ బాబు సహా మరికొందరు దాఖలుచేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. శుక్రవారం జరిగిన విచారణలో బ్లాక్ ఫంగస్ కేసులు, ఔషధాల లభ్యత గురించి ధర్మాసనం ఆరా తీసింది. ఇప్పటిదాకా మొత్తం 3వేల 783 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదగా... 2 వేల 334 మంది కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వివరించారు. 314 మంది ప్రాణాలు కోల్పోయారని, 11 వందల 35 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. సగటున రోజుకు 42 కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. 11 వేల 189 యాంఫోటెరిసిన్-B ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌పైనా ధర్మాసనానికి వివరాలు సమర్పించారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడినవారు కోటి 33 లక్షల మంది ఉండగా... 93.33 లక్షల మంది మొదటి డోస్, 25.23 లక్షల మంది రెండో డోస్ తీసుకున్నట్లు నివేదించారు. 18 నుంచి 45 ఏళ్ల లోపున్న 22.33 లక్షల మందికి మొదటి డోస్, 28 వేల మందికి రెండో డోస్ అందించినట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 28 ఆక్సిజన్ ప్లాంట్లు కేటాయించగా... ఇప్పటికే 5 ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించాయని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆగస్టు 15 నాటికి అన్ని ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏపీలో 2 వేల 897 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. 11 వందల 35 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే... 2 వేల 897 కేసులని కేంద్ర సర్కార్‌ చెప్పడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.

'భారీ వ్యత్యాసం ఎందుకుంది'

కేసుల సంఖ్య విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భారీ వ్యత్యాసం ఎందుకుందో తదుపరి విచారణలో చెప్పాలని ఆదేశించింది. మొదటి దశలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని... అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది Y.V.రవిప్రసాద్ కోర్టుకు వివరించారు. కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేసిందన్నారు. రెండో దశ వచ్చాక కంటైన్మెంట్ జోన్లు ప్రకటించలేదన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణాల్ని పరిశీలించాలన్నారు. కొవిడ్ మృతులను గుర్తించి పరిహారం చెల్లించాలని... పిటిషనర్ల తరఫు న్యాయవాదిలో ఒకరైన వాసిరెడ్డి ప్రభునాథ్ కోరారు. ఈ వ్యవహారాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి:

'బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పును సమీక్షించడం చట్టవిరుద్ధం'

కేంద్ర పరిధిలోకి వైద్య విద్య సీట్ల భర్తీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.