ETV Bharat / city

High Court: 'ప్రైవేటు'లో ఉచిత సీట్ల భర్తీపై స్టే ఎత్తివేత - ews

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేసే ప్రక్రియకు అడ్డంకి తొలగింది. 25 శాతం సీట్ల భర్తీ కోసం 2010 జూలై 30 ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యాహక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిన నేపథ్యంలో 25శాతం సీట్ల భర్తీ అమలుకు ఏంచేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

High Court
High Court
author img

By

Published : Aug 17, 2021, 3:23 AM IST

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేసే ప్రక్రియకు అడ్డంకి తొలగింది. 25 శాతం సీట్ల భర్తీ కోసం 2010 జూలై 30 ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యాహక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించిన నేపథ్యంలో 25శాతం సీట్ల భర్తీ అమలుకు ఏంచేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(1)సి ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలతో ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉందని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో వాదనలు వినిపించారు. 25 శాతం సీట్ల భర్తీకి వీలు కల్పిస్తున్న జీవో 44 అమలును నిలుపుదల చేస్తూ 2010 డిసెంబర్ 13న హైకోర్టు స్టే ఇచ్చిందని.. దీంతో ఏటా లక్షమంది పేద పిల్లలు సీట్లు కోల్పోతున్నారన్నారు. ఈ ఏడాది పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయినందున జీవోపై స్టేను ఎత్తివేయాలని కోరారు. విద్యాహక్కు చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని వివరించారు. ఆర్టీఐ చట్ట నిబంధనలను అనుసరించి 25శాతం సీట్ల భర్తీ నిమిత్తం 2010 జులై 30న ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44ను సవాలు చేస్తూ ఓ విద్యా సంస్థకు చెందిన సొసైటీ వేసిన వ్యాజ్యంలో అప్పట్లో హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు.

విద్యా సంస్థ సొసైటీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పటికే లేఖలు రాశామని, ఆ సొసైటీ నుంచి స్పందన లేదని వెల్లడించారు. ఆ సొసైటీ ఉనికిలో లేనట్లు అర్థం అవుతోందని అన్నారు. కొత్త సొసైటీ ఉనికిలోకి వచ్చాక తాజాగా వ్యాజ్యం వేసుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. జీవోపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులిచ్చింది. స్టే ఎత్తివేసిన నేపథ్యంలో 25సీట్ల భర్తీకి తీసుకోబోయే చర్యల వివరాల్ని కోర్టుకు సమర్పించాలని విద్యా శాఖను ఆదేశించింది.

ఇదీ చదవండి:

కొవిడ్ సన్నద్ధతపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.