HC on village secretariats: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని కోర్టుకు చెప్పాలని.. పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. అవసరం అయితే ఆ వివరాల ఆధారంగా న్యాయాధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తామని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ గతంలో దాఖలైన పలు వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Farmers Protest: 'జీడిమామిడి తోటలు తొలగిస్తే... ఆత్మహత్యలే శరణ్యం'