ఈ ఏడాది జనవరి నుంచి దివ్యాంగుల పెన్షన్ను నిలిపివేశారని అడబాల రాము అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పెన్షన్ నిలిపివేసే నాటికి అతనికి రేషన్ కార్డు లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాది వివరించగా.. హైకోర్టు ఈ వాదననను తోసిపుచ్చింది. గ్రామ వాలంటీర్ సిఫార్సుతో దివ్యాంగుడి పింఛన్ నిలిపేయటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దివ్యాంగుడి పెన్షన్ను కొనసాగించాలని.., నిలిపివేసిన నాటి నుంచి బకాయిలను చెల్లించాలని జస్టిస్ దేవానంద్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసలు వాలంటీర్కు ఉన్న చట్టబద్దత ఏంటో తెలిపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి