నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో అనిశా, సీఐడీ కౌంటర్ దాఖలు చేయకపోవటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ వేయడానికి ఇంత జాప్యమా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ వేయకపోతే నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశాలిచ్చారు.
నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలొద్దని పోలీసులను హైకోర్టు గతంలోనే ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు రాగా.. కౌంటర్ వేయడానికి పోలీసుల తరఫు న్యాయవాది మరికొంత గడువు కోరారు. విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: