పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ బంగాల్-బంగ్లాదేశ్ తీరం వేపుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో..,. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి విస్తారంగా, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: