ETV Bharat / city

Rains in Hyderabad: తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం - తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో(rains in hyderabad) జోరు వాన కురుస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

heavy rains in hyderabad
తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం!
author img

By

Published : Sep 4, 2021, 5:49 PM IST

తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం!

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరు వాన(hyderabad rains) కురుస్తోంది. నగరంలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది. అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నం, మీర్‌పేట, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, అబిడ్స్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.

నగరంలో వాన

ఖైరతాబాద్‌లో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పురా ప్రాంతంలో వాన కురుస్తోంది. రహదారులపై వాన నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అతిభారీ వర్షాలు

రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, షేర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వివరించారు.

నిండు కుండలా జలాశయాలు

జంటనగరాల్లోని జలాశయాలు నిండుకుండలా మారాయి. హైదరాబాద్ శివారులోని ఉస్మాన్‌సాగ‌ర్‌ (గండిపేట‌) జ‌లాశ‌యానికి అధికమొత్తంలో వ‌ర‌ద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగ‌ర్ 2 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురవనున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ‌(IMD) అంచనాలతో గేట్లు ఎత్తారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జలకళ

హైదరాబాద్ శివారులోని ఉస్మాన్‌సాగ‌ర్‌ (గండిపేట‌) జ‌లాశ‌యానికి అధికమొత్తంలో వ‌ర‌ద నీరు వచ్చి చేరుతోంది. శనివారం మ‌ధ్యాహ్నం వరకు ఉస్మాన్‌సాగ‌ర్(OSMAN SAGAR) గేట్లు ఎత్తే అవ‌కాశం ఉన్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురవనున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ‌(IMD) అంచనాలతో గేట్లు ఎత్తేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి:

LORRY IN FLOOD: అనంతలో వర్షాలు..కల్వర్టుపై వరద.. లారీ బోల్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.