ETV Bharat / city

కరోనా రెండో వేవ్ ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు: ఆళ్ల నాని

రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏపీలో కరోనా రెండో వేవ్ ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

కరోనా రెండో వేవ్ ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు: ఆళ్ల నాని
కరోనా రెండో వేవ్ ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు: ఆళ్ల నాని
author img

By

Published : Dec 24, 2020, 3:53 PM IST

బ్రిటన్​లో బయటపడిన కొత్త స్ట్రెయిన్​పై ప్రజల్లో ఆందోళన ఉందని మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఏపీలో దానికి సంబంధించిన ఆనవాళ్లేవీ లేవని.. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదన్నారు. యూకే నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినా ఆమె సాధారణంగానే ఉన్నారని తెలిపారు. ఆమె కుమారుడికి నెగెటివ్​గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. మరోవైపు ఆమె నుంచి సేకరించిన స్వాబ్ నమూనాను పూణేలోని వైరాలజీ ల్యాబ్​కు పంపించినట్టు మంత్రి తెలిపారు. దిల్లీ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ ఫస్ట్ క్లాస్ బోగీలో వచ్చినందున మిగిలిన ప్రయాణికులతో కాంటాక్టు తక్కువగానే ఉండొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. యూకేతో పాటు విదేశీ ప్రయాణికులపై దృష్టి సారించేందుకు ఇతర రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లోనూ బృందాలను నియమించామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఈడీ తాత్కాలిక జప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.