రాష్ట్రంలో ఇప్పటివరకు 1.18 కోట్ల మందికి టీకా అందించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 18.7 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు ఉన్నారన్న సింఘాల్.. ఇప్పటివరకు 3.16 లక్షల మందిని విజయవంతంగా వ్యాక్సినేషన్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ ద్వారానే కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: