విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేసినందుకు తనకు రాష్ట్రపతి అవార్డు దక్కిందని జైళ్ల శాఖలో హెడ్ వార్డర్‌గా పనిచేస్తున్న రత్నరాజు అన్నారు. ప్రస్తుతం ఈయన విజయవాడ జైళ్ల శాఖ డీజీ కార్యాలయంలో పని చేస్తున్నారు. జైళ్ల శాఖ నుంచి ఏడుగురిని రాష్ట్రపతి అవార్డుకు పంపగా.. ఇద్దరు ఎంపికయ్యారని తెలిపారు. చిన్న ఉద్యోగికి ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
రత్నరాజు.. 1993 మార్చిలో తెలంగాణలోని సికింద్రాబాద్ కారాగారంలో వార్డర్‌గా ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. చర్లపల్లి, సికింద్రాబాద్, తాడిపత్రి జైళ్లలో పనిచేశారు. జైల్లో ఖైదీలకు ములాఖాత్‌లు ఇచ్చేటప్పడు సక్రమంగా విధులు నిర్వహించటం, కారాగారంలోని కార్యాలయంలో నిబద్ధతతో పని చేసినందుకు ఉత్తమ వార్డర్‌గా గతంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఇదీ చదవండి: స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేలా ఉద్యానవనం