కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంపై విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అంతుకుముందు కొండపల్లి మున్సిపాలిటీ తరఫున ప్రభుత్వ న్యాయవాది శివాజీ వాదనలు వినిపిస్తూ.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్టెడ్ సభ్యునిగా తెదేపా ఎంపీ కేశినేని నాని ఆప్షన్ ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనే అర్హత ఎంపీకి ఉండదన్నారు.
ఎంపీ ఓటు హక్కు అభ్యర్ధనను ఎన్నికల అధికారి తిరస్కరించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలి తప్ప హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. పురపాలకశాఖ తరపున అదనపు ఏజీ వాదనల కోసం విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక విషయంలో ఓటు వినియోగం కోసం ఎంపీ కేశినేని నాని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితాల వెల్లడి వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది.
ఇదీ చదవండి:
Tirumala Udayasthamana Tickets: శ్రీవారి ఉదయాస్తమాన టికెట్ ధర కోటి.. ప్రత్యేకతలు ఇవే!