Hanging traffic signals విజయవాడలో అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే బెంజ్ సర్కిల్ కూడలిలో ఇటీవల అమర్చిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవి. రెండు పైవంతెనల దిమ్మెలకు మేకులుకొట్టి తీగలతో వీటిని బిగించారు. గాలివచ్చినప్పుడు ఊగుతూ.. అటుఇటూ ప్రమాదకరంగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులకు సిగ్నల్స్ సరిగా కనపడకపోవడంతో రెడ్ సిగ్నల్ పడినా వచ్చేస్తున్నారు. కాస్త తెలిసిన వారు సిగ్నల్స్ ను అనుసరించేందుకు బ్రిడ్జివైపు తీక్షణంగా చూస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు డైరెక్షన్లలోని సిగ్నల్స్ వాహనదారులకు కనిపించేలా ఒకే స్తంభానికి అమర్చాలి. ఎత్తులో కాకుండా వాహనదారులకు కనిపించేలా ఒక నిర్ణీత ఎత్తులో వీటిని అమర్చాల్సి ఉంది.కొన్నింటిని వంతెనలకు వేలాడదీసి వంతెనకు మేకులుకొట్టి అమర్చారు. వీటివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇవీ చదవండి: