ETV Bharat / city

రాష్ట్రంలో సామాజిక సంక్రమణ ప్రాథమిక దశలో కరోనా వైరస్

author img

By

Published : Apr 8, 2020, 6:34 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక సంక్రమణ ప్రాథమిక దశలో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైరస్‌ వ్యాప్తి నివారణకు రెండంచెల వ్యూహాంతో పనిచేస్తున్నట్లు తెలిపింది. వైరస్‌ప్రభావిత హాట్‌స్పాట్‌లను గుర్తించి కంటైన్మెంట్‌ చేయడంతోపాటు … ఎక్కువ నమూనాలు సేకరించనున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ ముగిసినా ప్రభావిత ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

latest-news-of-govt-scheems-on-corona-virus
రాష్ట్రంలో సామాజిక సంక్రమణ ప్రాథమిక దశలో కరోనా వైరస్
రాష్ట్రంలో సామాజిక సంక్రమణ ప్రాథమిక దశలో కరోనా వైరస్

రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు సామాజిక నిఘాతోపాటు వైద్య సేవల సన్నద్ధతపై దృష్టి పెట్టామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రానికి విదేశాల నుంచి 29 వేల మందిరాగా దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు సుమారు వెయ్యిమంది వరకు ఉన్నారని వెల్లడించింది. మర్కజ్‌తో సంబంధం ఉన్న 3,500 మంది శాంపిళ్లు తీశామన్న వైద్యారోగ్య శాఖ...దేశ సరాసరితో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ నమూనాలు సేకరిస్తున్నట్టు తెలిపింది. ఇంటింటి సర్వేలో సుమారు 5వేల మంది అనుమానితులను గుర్తించామని, వీరిలో1800 నుంచి 2 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. 3లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు దిగుమతి చేసుకుంటామన్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి.. రాబోయే రోజుల్లో 2 నుంచి 3 లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 240 ట్రూనాట్‌ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.

కరోనా చికిత్సల కోసం వివిధ ఆస్పత్రుల్లో 20 వేల పడకలు సిద్ధం చేశామన్న జవహర్‌రెడ్డి రాష్ట్ర స్థాయిలో 4 కోవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుత లాక్‌డౌన్ కాలం పూర్తైనా విజయవాడ, గుంటూరు వంటి హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని జవహర్‌రెడ్డి తెలిపారు.కరోనా చికిత్స అందించేందుకు ఒప్పంద, పొరుగు సేవల విధానంలో ఉద్యోగాలు పొందిన వారికి భవిష్యత్‌లో జరిగే శాశ్వత నియామకాల్లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది.

ఇదీ చూడండి తెదేపా ఎమ్మెల్యే అరెస్టుపై గవర్నర్​కు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.