నూతన మైనింగ్ విధానంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, రవాణా కోసం టెండర్ల నిర్వహణ బాధ్యత వంటివి పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి 13 జిల్లాలను 3 జోన్లుగా విభజిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలను ఒక జోన్‌గా వర్గీకరించారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను మరో జోన్‌గా..,నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లా, అనంతపురం జిల్లాలను ఒక జోన్‌గా నిర్ణయించారు.
ఇసుక తవ్వకం, సరఫరాకు ఆసక్తి గల సంస్థల నుంచి వేర్వేరుగా బిడ్లను ఎంఎస్టీసీ ఆహ్వానించనుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇసుక తవ్వకాలు చేపడతామని, ఆయా సంస్థలతోను వేర్వేరుగా ఒప్పందాలు ఉంటాయని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
ఇదీచదవండి
5.30కి గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. విగ్రహాల ధ్వంసంపై వివరణ ఇచే అవకాశం