గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ విజయవాడకు రానున్నారని ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. దిల్లీ పర్యటన అనంతరం బిశ్వభూషణ్‌కు కరోనా లక్షణాలు బయట పడటంతో ఈ నెల 15న హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేరారు. మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకోనున్నారు.
ఇదీ చదవండి:
High court on three capitals cases: 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి: హైకోర్టు