ETV Bharat / city

ప్రతి ఒక రక్తదాత మరొకరికి జీవితాన్ని ఇచ్చినట్లే: గవర్నర్ బిశ్వ భూషణ్

ప్రతి ఒక రక్తదాత మరొకరికి జీవితాన్ని ఇచ్చినట్లేనని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. గుంటూరు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రక్త కణ విభజన కేంద్రాన్ని(కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్‌) వర్చువల్ ద్వారా ప్రారంభించారు.

Governor inaugurate component separation unit
ప్రతి ఒక రక్తదాత మరొకరికి జీవితాన్ని ఇచ్చినట్లే: గవర్నర్ బిశ్వ భూషణ్
author img

By

Published : Dec 30, 2020, 9:06 PM IST

అన్నిదానాల్లోకెల్లా రక్తదానం అత్యంత విలువైందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతి ఒక రక్తదాత మరొకరికి జీవితాన్ని ఇచ్చినట్లేనని అన్నారు. గుంటూరు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రక్త కణ విభజన కేంద్రాన్ని(కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్‌) ప్రారంభించారు. రాజ్​భవన్ నుంచి వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్లాస్మా, ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్త కణాల కోసం కాంపోనెంట్స్ సెపరేషన్ యూనిట్, బ్లడ్ కలెక్షన్ వ్యాన్ కోసం రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్ష్ కలిసి రూ. 1.45 కోట్లు సమకూర్చాయి. రక్త కణ భాగాలను వేరు చేసే విభాగం ఏర్పాటు చేయటంలో రెడ్‌క్రాస్‌తో చేతులు కలిపినందుకు రోటరీ సంస్థలను గవర్నర్ హరిచందన్ అభినందించారు.

ఇదీ చూడండి:

'25 లక్షల ఇళ్లు ఇస్తామన్నాం.. 30 లక్షలకు పైగా ఇవ్వబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.