ఏజెన్సీల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ 22, 23 వ స్నాతకోత్సవంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని సందేశం ఇచ్చారు. వైద్యరంగంలో ఉత్తమ సేవలందిస్తున్న జెమ్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ పళనివేలు, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిలకు పురస్కారాలను ప్రదానం చేశారు. మెరిట్ సాధించిన విద్యార్ధులకు అవార్డులు అందించారు.
పరిశోధనలను ప్రోత్సహించటానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీయమని గవర్నర్ అన్నారు. 20 ఏళ్ల క్రితం తన తండ్రి భాస్కరరెడ్డి ఇదే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారని డాక్టర్ నాగేశ్వరరెడ్డి గుర్తు చేసుకున్నారు. తనకూ గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రాథమిక సూత్రాలని అనుసరించే వారికి వృత్తిగతంగా గౌరవంతో పాటు మంచి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకుంటారని డాక్టర్ నాగేశ్వరరెడ్డి సూచించారు.
ఇదీచదవండి.