ETV Bharat / city

Meeting: సీఎం జగన్​ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు - ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం వార్తలు

ముఖ్యమంత్రి జగన్​(cm jagan)ను..ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిశారు. ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను.. సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రతినిధులు వెల్లడించారు.

government employees association met cm jagan
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం
author img

By

Published : Oct 26, 2021, 8:12 PM IST

ముఖ్యమంత్రి జగన్​(cm jagan)ను..ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (government employees association) ప్రతినిధులు కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అసోసియేషన్‌ అధ్యక్షుడు కే.ఆర్‌.సూర్యనారాయణ సహా ఉద్యోగ సంఘాల నాయకులు.. సీఎంతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రతినిధులు వెల్లడించారు.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రీషెడ్యూలు

ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని(joint staff council meeting).. రాష్ట్ర ప్రభుత్వం రీషెడ్యూలు(reschedule) చేసింది. రేపు నిర్వహించాల్సిన ఈ సమావేశాన్ని తొలుత వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఇవాళ సమావేశం రీషెడ్యూలు సమయాన్ని ప్రకటించింది. ఈ నెల 29న.. మద్యాహ్నం 3 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ప్రకటించింది. ఈమేరకు జాయంట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రీషెడ్యులుకు సంబంధించిన సమాచారాన్ని అన్ని ఉద్యోగ సంఘాలకు సమాచారమిచ్చారు. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ వేతనాల పెంపు తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించనుంది.

ఇదీ చదవండి:

చాలా మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.